వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర వైయస్ఆర్ సేవాదళ్ అధ్యక్షుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిని వైయస్ఆర్ సీపీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది.