ఎమ్మెల్సీ ఎన్నికల పై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మానిటర్ చేస్తున్నారు. పోలింగ్‌లో అక్రమాలు, వైసీపీ దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులను పార్టీ నేతలు అధినేతకు వివరించారు. వివిధ ఘటనలపై కడప ఎస్పీ, తిరుపతి జిల్లా ఎస్పీ , కలెక్టర్లతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఉదయం నుంచి జరిగిన ఘటనలు అధికారులకు వివరించి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఇంత స్థాయిలో అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలు దిగకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు.