ప్రజా సంక్షేమం కోసమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 15వ డివిజన్ 68వ సచివాలయం పరిధిలోని స్క్రూ బ్రిడ్జి వద్ద నుండి పడవలరేవు సెంటర్ వరకు నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లారు. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో సీఎం జగన్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. సచివాలయం పరిధిలోని మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు వైస్సార్సీపీ నాయకులు వెంకటరెడ్డి, బాలాజీ, చిన్న, కాము, అబ్బు, రెహమాన్, కలాం, విశ్వనాధ్, బాల తదితరులు పాల్గొన్నారు.