రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. అనంతరం సభలో ప్రవేశపెట్టిన బిల్లులను కేబినెట్ సమావేశంలో ఆమోదించనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ 2023-24 వార్షిక బడ్జెట్ను ఈ నెల 18న శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.