పల్నాడు జిల్లాలో 10 వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు కొన్నిస్కూల్ ఫీజులు పూర్తిగా కట్టలేదన్న కారణం చూపుతూ హాల్ టికెట్ లు ఇవ్వడం లేదన్న విషయం కలెక్టర్ తన దృష్టికి వచ్చిందని అన్నారు. ఎవరైనా 10 వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు విద్యాసంస్థలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని డిఈవో ను ఆదేశించారు.