చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వచ్చిన వారు కొన్ని చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. రోజూ 6-8 గ్లాసుల నీటిని తాగాలి. నిమ్మరసం, పండ్ల రసాలను కూడా తాగొచ్చు. ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవాలి. స్మోకింగ్ కి దూరంగా ఉండాలి. ఆందోళన, ఒత్తిడి వల్ల కూడా నుదుటిపై ముడతలు వస్తాయి. యోగా, మెడిటేషన్, వర్కవుట్లతో దీనికి చెక్ పెట్టొచ్చు.