మంగళగిరిలో టిడిపి కేంద్ర కార్యాలయం నందు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ను నేషనల్ నవ క్రాంతి పార్టీ వ్యవస్థాపకులు కనకం శ్రీనివాసరావు ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరిలో కనకం శ్రీనివాసరావు మాట్లాడుతూ. చంద్రబాబును కలిసి రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర రాజధాని పలు అంశాల సమస్యలు, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు, రాష్ట్ర బడ్జెట్ గురించి అసెంబ్లీలో చర్చించాలని చంద్రబాబు నాయుడుని కోరానని తెలిపారు. అదేవిధంగా రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి అవతావకలు జరగకుండా సజావుగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.