పంజాబ్ మంత్రి హర్జోత్ బెయిన్స్ ఓ ఐపీఎస్‌తో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. పంజాబ్ కేడర్‌కే చెందిన IPS అధికారిణి జ్యోతి యాదవ్‌తో త్వరలో ఏడడుగులు వేయనున్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగినట్లు సమాచారం. ఈనెలలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వివాహానికి ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ హాజరు కానున్నారట.