ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందీ గెస్ట్ లెక్చరర్ పోస్ట్ కి ఇంటర్వ్యూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2023, 04:17 PM

రాయచోటి నగరంలోని స్థానిక చిత్తూరు రోడ్డు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఈ నెల గురువారం అనగా 16. 03. 2023 తేదీన ఉదయం 10 గంటలకు కళాశాలలో హిందీ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఇంటర్వ్యూ జరుపబడును అని ప్రిన్సిపాల్ డా. హర్షలతా పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు. హాజరయ్యే అభ్యర్థులు హిందీ పిజి డిగ్రీ లో 55% మార్కులు తో పాటు కనీస అనుభవము కలిగి ఏపి సెట్, నెట్ లాంటి అధనపు విద్యార్హతలు కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును అని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువ పత్రాలతో గురువారం ఉదయం హాజరు కావాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa