ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో పురోగతిని సమీక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో వేగవంతం చేయాలని సింగ్ పిలుపునిచ్చారు, జాతీయ భద్రతా విషయాలలో 'మొత్తం దేశం' విధానాన్ని అవలంబించాలని పేర్కొన్నారు.పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు, తరచూ సమావేశమయ్యే కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా కూడా పాల్గొన్నారు.