మచిలీపట్నంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాపుల ఆరాధ్య దైవుడు అయిన వంగవీటి రంగాను తాను చిన్నప్పుడు మా ఇంట్లో కలిశానని పవన్ తెలిపారు. ఆయనకు తన చేతితో టీ అందించానని పవన్ కళ్యాణ్ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. కాపులు, బీసీలు మెజారిటీలో ఉండి దేహి అనే పరిస్థితుల్లో ఉన్నారంటే కులాల్లో ఐక్యత లేకపోవడమేనని అన్నారు. ఐక్యతతో అన్ని సాధించుకోవచ్చన్నారు. కాపులు, బీసీలకు అండగా ఉంటామని చెప్పారు.ఆంధ్రప్రదేశ్లో కుల వివక్షను అరికట్టాలన్నారు. అన్ని కులాలకు ప్రాతినిథ్యం రావాలంటే జనసేన పాలన రావాలని పవన్ అన్నారు.