హైస్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ పరీక్షలో జనరల్ సైన్స్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి 22 మందిని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన మీడియా నివేదికల దృష్ట్యా మార్చి 13న జరగాల్సిన జనరల్ సైన్స్ సబ్జెక్టు హైస్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (హెచ్ఎస్ఎల్సి) పరీక్షను అస్సాంలోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సెబా) రద్దు చేసింది.పేపర్ లీకేజీకి సంబంధించిన నివేదికల నేపథ్యంలో ఆదివారం రద్దు చేసిన జనరల్ సైన్స్ పేపర్‌ను మార్చి 30న నిర్వహిస్తామని అస్సాం విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు సోమవారం తెలిపారు.గనిర్గ్రామ్లోని జెఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్లో రద్దు చేసిన ఇంగ్లిష్ పరీక్షను మార్చి 28న నిర్వహిస్తామని ఆయన తెలిపారు.