దివంగత ఎమ్మె ల్సీ, టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు పార్టీకి అంకిత భావంతో పనిచేశాడని నిబద్దత గల నేత అని టీడీపీ నేతలు కొనియాడారు. విజయవాడ ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో అర్జునుడు సంతాపసభ జరిగింది. తొలుత అర్జునుడు చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.అనంతరం జరిగిన సభలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ అర్జునుడు మంచి స్నేహితుడని, పార్టీలో వివిధ హోదా ల్లో పనిచేసినా అందరితో ఎంతో స్నేహభావంతో ఉం డేవారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూ డా అధికార పక్షం చేసే అస్తవ్యస్త విధానాలపై వీరోచితంగా పోరాడరన్నారు. ఉమ్మడి జిల్లాలో సైకిల్ యాత్ర, పాదయాత్రలను జయప్రదంగా నిర్వహించా రంటూ కొనియాడారు. పార్టీలో ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీకి ఎనలేని సేవలందించారన్నారు. ఆయన మరణవార్త విన్న వెంటనే పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర కలత చెందారని, ఆయన అంతిమ యా త్రలో పాల్గొని ఆ కుటుంబానికి అండగా ఉంటామని మాట ఇచ్చారన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా అ ర్జునుడు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారన్నా రు. పార్టీ అధికార ప్రతినిధి నాగుల్‌మీరా, రాష్ట్ర పార్టీ కోశాధికారి రఽశీరామ్ తాతయ్య. తూమాటి ప్రేమనాథ్, బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి అర్జునుడి సేవలను గుర్తు చేసుకున్నారు. సింహాద్రి కనకాచారి, గన్నేప్రసాద్, కొత్త నాగేంద్రకుమార్, నాగాబాబు, దొంతు చిన్న పాల్గొన్నారు. ఈనెల 16న బందరులోని అర్జునుడి నివాసంలో ఆయన దశదిన కర్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa