ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరుకుల పంపిణీపై ప్రతీ నెల 15న సమావేశం నిర్వహించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 12:54 PM

బియ్యం కార్డు దారులకు నిత్యావసర సరుకులు అందించే బాధ్యత అధికారులదేనని, ఎలాంటి ఆలస్యం చేయవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం  కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వ హించారు. బియ్యం, కంది పప్పు, పంచదార తదితర సరుకుల పంపిణీలో ఆలస్యానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రతీ నెల 1వ తేదీ నాటికి ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ సరుకులను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. విధి నిర్వ హణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సరుకుల పంపిణీపై ప్రతీ నెల 15న సమావేశం నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌కు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి డీవీ రమణ, సివిల్‌ సప్లై డీటీలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa