నేడు వైఎస్ వివేకా నాలుగో వర్ధంతి సందర్భంగా తండ్రి సమాధి వద్ద ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి హత్య కేసులో సొంత కుటుంబసభ్యుల మీద ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణ దశలో ఉందని.. ఈ సమయంలో తాను దీనిపై మాట్లాడబోనన్నారు. తనకు తెలిసిన విషయాలన్నీ.. సీబీఐకి ఇచ్చానన్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. పోలీసుల మీద ఒత్తిడి పెట్టకుండా వాళ్ల పని వాళ్లని చేయనీయాలని సునీత పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa