ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగళం పాదయాత్ర అప్ డేట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 01:04 PM

నారా లోకేష్ యువగళం పాదయాత్ర అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపలె నియోజకవర్గంలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం తంబళ్లపల్లె నియోజకవర్గం గుట్టపాలెం విడిది కేంద్రం నుంచి 43వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్  ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా సెల్ఫీవిత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత  చురుకుగా పాల్గొంటున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి గుట్టపాలెం విడిది కేంద్రం వద్దకు వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి వారితో లోకేష్ ఫోటోలు దిగారు. ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి యువనేత సెల్ఫీ ఇస్తున్నారు. లోకేష్  ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa