హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్కు మరోసారి ప్రమాదం తప్పింది. రైలులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. రైలు బయలుదేరిన కాసేపట్లో పొగలు రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో లోకో పైలట్ రైలును మౌలాలి స్టేషన్లో నిలిపివేశారు. దీంతో రైలును అక్కడే నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు. ఆ తర్వాత రైలు తిరిగి బయలుదేరింది. ఈ ఘటనతో గోదావరి ఎక్స్ప్రెస్ రైలు సాయంత్రం 6:10 గంటల నుంచి 6:25 గంటల వరకు మౌలాలి స్టేషన్లో నిలిచిపోయింది.