ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2022 వరకు, 13 పెద్ద, భారీ ప్రాజెక్ట్లు 15,099 కోట్ల రూపాయల పెట్టుబడి, 12,490 మందికి ఉపాధిని కల్పించి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. అదే విధంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్ఎస్ఎమ్ఈ) రంగంలో 7,742 కోట్ల రూపాయల పెట్టుబడితో 54,430 యూనిట్లు 2,11,219 మందికి ఉపాధి కల్పనతో ఉత్పత్తిలోకి ప్రవేశించాయి మంత్రి బుగ్గన అసెంబ్లీ సమావేశాల్లో తెలియజేసారు.