మద్యం మత్తులో పడి ఏకంగా తన పెళ్లి విషయాన్నే మర్చిపోయాడు ఓ వరుడు. బిహార్ భాగల్పూర్కు చెందిన మియాన్కి సుల్తాన్గంజ్తి చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. మంగళవారం ఉదయం ముహూర్తాన్ని ఖరారు చేశారు. ముహూర్త సమయం దాటినా పెళ్లి కుమారుడు రాకపోయేసరికి వధువు కుటుంబీకులు ఆందోళన చెందారు. అతడు మధ్యాహ్నం సమయంలో మద్యం సేవించి పెళ్లి మండపానికి వచ్చాడు. దీంతో వధువు పెళ్లిని రద్దు చేసుకుంది.