అరుణాల్ ప్రదేశ్లోని మండలా పర్వత ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. కుప్పకూలిన ఛాపర్లోని పైలట్లు ఇద్దరూ మరణించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. మరణించిన పైలట్లను లెఫ్ట్నెంట్ కల్నల్ VVB రెడ్డి, మేజర్ జయంత్గా గుర్తించారు. లెఫ్టెనెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి.. తెలంగాణలోని యాదాద్రి జిల్లాకు చెందినవారుగా తెలిసింది.