గుంటూరు నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు, ప్రస్తుత ఏడాది డిమాండ్ ఏక మొత్తంలో వెంటనే చెల్లించే వారికి వడ్డీ మాఫీ వర్తిస్తుందని కమిషనర్ చేకూరి కీర్తి గురువారం తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కోసం నగరపాలక సంస్థ ప్రధాన సర్కిల్ కార్యాలయాలతో పాటు మరిన్ని వార్డు సచివాలయంలో పన్ను చెల్లించేందుకు నగదు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వడ్డీ మాఫీ ఈనెల 31 వరకే వర్తిస్తుందన్నారు.