చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో ఇద్దరు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎంపీపీ ఎల్లప్ప శుక్రవారం పంపిణీ చేశారు. తాటిగుంటపాలెం చెందిన లితేష్ కుమార్ రెడ్డి ప్రమాదంలో గాయపడ్డాడు. ఈయనకు రూ 1. 60 లక్షలు, గొంగివారిపల్లె చెందిన మల్లీశ్వరి రెడ్డికి రూ. 18, 000 చెక్కును ఆయన అందించారు. కార్యక్రమంలో నాయకులు గిరినాథ్ రెడ్డి, మల్లికార్జున, నారాయణరెడ్డి, దేవేంద్ర రెడ్డి పాల్గొన్నారు.