పుల్లలచెరువు మండలంలోని ప్రతి పంచాయతీలో వర్మీ కంపోస్టు యూనిట్ లను ఏర్పాటు చేయాలని ఈఓఆర్డీ బాలునాయక్ సూచించారు. శుక్రవారం కొమరోలు గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వర్మీ కంపోస్టు తయారీకి అవసరమైన వాన పాములు వేసినట్లు ఈఓఆర్డీ తెలిపారు. యండ్రపల్లి, కోమరోలు, రాచకొండలో యూనిట్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటి వల్ల పంచాయతీలకు ఆదాయం సమకూరడంతో పాటు రైతులకు కూడ ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి శివ, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.