ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో కొద్దిగా పాటి వర్షాలకే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే బస్టాండ్ సమీపంలో గురువారం రాత్రి కురిసిన కొద్దిగా పాటి వర్షానికి నీరు నిలిచిపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని సంబంధిత అధికారులు పట్టించుకోని సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.