లక్ష్యం లేనిదే జీవితం లేదు అని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. 2015 లో ఐక్యరాజ్యసమితి ప్రవేశ పెట్టిన సస్టిరాభి వృద్ది లక్ష్యాల సాధనకు కృషి చేయాలి అని పార స్వచ్ఛంద సంస్థ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ నిమ్మ రాజు శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం ఒంగోలు రామ్ నగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మానవ హక్కుల సంఘం ప్రతినిధులు కు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. లక్ష్యాలను 2030 కి సాధించాలని అప్పుడే అన్ని దేశాల్లో ఆకలి చావులు, పేదరికం, వివక్షత లేకుండా అందరి ఆరోగ్యం, జీవన ప్రమాణాలు పెంపు, గుణాత్మక విద్య మంచి నీళ్ళు అంది ప్రతి దేశం ప్రగతి పథంలో ముందుకు నడుస్తుందని చెప్పారు. అయితే బాలలు భాగస్వామ్యాన్ని మెరుగు పరిచే విధంగా సంఘాలలో పాల్గొన్న వారి వారి తోటి వారికి సహాయం చేసే విధంగా గా ఉండాలి అని చెప్పారు. ముఖ్యంగా సుస్థిరాభి వృద్ది లక్ష్యాల గురించి అవగాహన చేసుకోవాలి అని వాటి సాధనలో తమ వంతు కృషి చేయాలి అని తెలిపారు.