ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ను ఆదర్శంగా తీసుకోవాలరి ఆహారవిజ్ఞానశాస్త్ర సాంకేతిక కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ఎస్ బేగ్ అన్నారు. పులివెందుల పట్టణంలో స్థానిక ఫుడ్ టెక్నాలజీ కళాశాల లో గురువారం అమరజీవి122వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్ఎస్ బేగ్ మాట్లాడుతూ మద్యపాన నిషేదం కోసం హరిజనుల ఆలయ ప్రవేశం కోసం జైళ్ల సంరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పోరాటయోధుడని కొనియాడారు. తెలుగుభాష మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్‌తో ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ఆత్మత్యాగం చేసిన అమరజీవి మనందరికీ సూర్తిదాయకమన్నారు. అమరజీవి త్యాగం, ఆయన సంగ్రహ జీవిత చరిత్రను విద్యార్థులకు విశదీకరించారు. కార్యక్రమంలో ఆఫీసర్ ఇన్చార్జి డాక్టరు పి జయమ్మ, అధ్యాపకులు డాక్టర్ ఏడుకొండలు, అరుణ, నివేదిత, కె రాజేష్, డాక్టర్ కె రాజశేఖర్, పాల్గొన్నారు.