ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెనాలిలో నిరవధిక సమ్మె చేపట్టారు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు తెనాలి బ్రాంచ్ వద్ద శిబిరం ఏర్పాటు చేసి ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఉద్యోగులకు ఆరోగ్య బీమా కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల వరకు పెంచాలని, కెపాసిటీ టూ పే నిబంధనలకు సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను వినిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa