రానున్న ఎన్నికలలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించిన చోటు నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి, టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి మండలం బృగు బండలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని, పార్టీ భావజాలాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. బాబు నిర్ణయం ఏదైనా తమకు అంగీకారమే అన్నారు.