రాంబిల్లి మండలం వైలోవ మాజీ ఎంపీటీసీ కర్రీ సింహగిరి ప్రసాద్ ఆధ్వర్యంలోశనివారం రాంబిల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించడంతో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచడం జరిగింది. సైకో పోవాలి.. సైకిల్ రావాలని నినాదాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రఘు రాజు, రమేష్ రాజు, చోడపల్లి సత్యనారాయణ, ఎస్ అప్పలరాజు, ఐటిడిపి సిహెచ్ మంగరాజు, మండల తెలుగు యువత అధ్యక్షులు ఎరుపెల్లి అజయ్, బి.నారాయణరావు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.