ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ నాయకులూ మాట్లాడుతూ..... ప్రభుత్వంపై ప్రజల్లో మరీ ఇంత వ్యతిరేకత ఉందని అనుకోలేదని అన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ కి శాశ్వితంగా చరమగీతం పాడే సమయం వస్తుంది అని అభిప్రాయపడ్డారు. వైసీపీ నాయకులూ మాత్రం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినా.. విద్యావంతులు ఎందుకు విశ్వసించలేదన్న అంతర్మథనంలో పడ్డారు.