ఉద్దానం ప్రజలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే తపన, చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పనిచేస్తున్నారని, రూ.742 కోట్ల వ్యయంతో 100 కిలోమీటర్ల తాగునీటి పైపులైన్ నిర్మిస్తున్నామని, జూన్‌లో పైపులైన్ నిర్మాణ పనులు పూర్తవుతాయని, ఆ ప్రాంతానికి సురక్షితమైన తాగునీరు అందుతుందని మంత్రి రజిని తెలియజేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ఉద్దానం ప్రాంత ప్రజలకు ఇబ్బందిలేకుండా రానున్న కాలంలో పలాస డయాలసిస్ యూనిట్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని రూ.50 కోట్లతో నిర్మించనున్నామన్నారు. ఆ ఆస్పత్రిలో 151 మంది మెడికల్ స్టాఫ్‌ను అందుబాటులో ఉంచి ఉద్దానం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించబోతున్నామని చెప్పారు.