ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉంది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభైన గురువారం నుంచి శుక్రవారం రాత్రి వరకు మద్యం దుకాణాలు తెరవకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే ఈనిబంధనలు మాకు పట్టవన్నట్టు అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాలలో ఓ బార్ యథేచ్ఛగా తెరిచి విక్రయాలు జరిపారు. దీంతో భారీ సంఖ్యలో మందుబాబుకు క్యూ కట్టారు. అటు అధికారులు గానీ, ఎక్సైజ్ శాఖ గానీ పట్టించుకోలేదు. దీంతో కోడ్ ఉల్లంఘించి మందుబాబులకు కిక్ ఎక్కించేలా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. దీంతో స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.