రైలు కింద పడి యాచకురాలు మృతి చెందిన సంఘటన దువ్వాడ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ శాంతారామ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుమారు 55 నుంచి 60 ఏళ్ల వయస్సు గల మహిళ గురువారం రాత్రి రైలు కింద పడి మృతి చెందినట్టు సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతురాలు రైళ్లలో భిక్షమెత్తుకునే మహిళగా గుర్తించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.