ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిసోడియాకు దక్కని ఊరట

national |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2023, 03:30 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ప్రధాన నిందితుడైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఈడీ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు మరో 5 రోజులు పొడిగించింది. సిసోడియా విచారణలో కీలకమైన సమాచారం లభించిందని ఈడీ కోర్టుకు తెలిపింది. సిసోడియా ఈ-మెయిల్‌, మొబైల్‌ ఇతర డివైస్‌ల నుంచి భారీ సమాచారాన్ని విశ్లేషణ చేస్తున్నామని చెప్పింది. దీనిపై సిసోడియా న్యాయవాది స్పందిస్తూ కేసులో ప్రాథమిక సాక్ష్యాలైనా లభించలేదని, ఈ నేపథ్యంలో కస్టడీ పొడిగింపులో అర్థం లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa