నకరికల్లు పరిధిలోని అద్దంకి- నార్కెట్ పల్లి రాష్ట్ర రహదారిలో శనివారం సాయంత్రం ఈదురు గాలుల ధాటికి భారీ లారీ బోల్తా పడింది. చెన్నై నుండి హైదరాబాద్ కు ఫ్రిజ్ ల లోడుతో వెళ్తున్న లారీ శ్రీరాం పురం వద్ద ఒక్కసారిగా బోల్తా పడటంతో, లారీలో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పడిపోయిన లారీని ప్రొక్లెయిన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ క్రమబద్దకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa