బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు శనివారం ఇమెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో ముంబై పోలీసులు జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ మరియు మోహిత్ గార్గ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. బెదిరింపుల నేపథ్యంలో నటుడి సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సల్మాన్ ఖాన్ మేనేజర్ మరియు సన్నిహితుడు ప్రశాంత్ గుంజాల్కర్ ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపుల ఆధారంగా, ప్రభుత్వం ఇటీవల హీరో సల్మాన్ ఖాన్ భద్రతను కూడా పెంచింది.ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాము అని బాంద్రా పోలీసులు తెలిపారు.