ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ కోణం కేసులో తాజాగా, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు పంపింది. రేపు (మార్చి 21) విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఇటీవలే మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో, మాగుంట శ్రీనివాసులురెడ్డిని కూడా ఈడీ ప్రశ్నించనుంది. ఇదిలా ఉంటే మాగుంట రాఘవ కస్టడీని ఈ నెల 28 వరకు పొడిగించడం తెలిసిందే. రాఘవ బెయిల్ పిటిషన్ ఈ నెల 23న సీబీఐ స్పెషల్ కోర్టులో విచారణకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa