పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం నడిగడ్డకు చెందిన మల్లికార్జున రెండుసార్లు గిన్నిస్ రికార్డు సాధించాడు. యోగాసనం, అంతర్జాతీయ కాలింగ్ కోడ్లు గుర్తించడంలో రెండుసార్లు గిన్నిస్ రికార్డు పొందారు. ఈ సందర్భంగా ఎర్రాతివారిపల్లెలో ఆయనను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa