గుంటూరు మిర్చి యార్డు లో 7 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చైర్మన్ మద్ది రెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు. మిర్చి యార్డులో శుక్రవారం నిర్వహించిన పాలక సమావేశంలో ఆయన మాట్లాడారు. యార్డులో చేపట్టనన్న పనులు ప్రతిపాదించి కమిటీలో తీర్మానం ఆమోదించామన్నారు. ఆదాయంపై చర్చించారన్నారు. గత ఏడాది ఆదాయంతో పోలిస్తే ప్రభుత్వం సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రస్తుతం మిర్చి ధరలు పెరిగి ఆశాజనకంగా ఉన్నాయన్నారు.