ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కలియుగ వైకుంఠ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడా నికి భక్తులు రద్దీ స్వల్పంగా ఉంది. ఈ సందర్భంగా టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఈ మేరకు 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 63, 507 మంది దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు 29, 205 మంది తలనీనాలు సమర్పించిన్నట్లు తెలిపారు. అనంతరం శ్రీ స్వామి వారికి శుక్రవారం హుండీకి రూ. 3. 72 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa