ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రానికి వరప్రసాదిని పోలవరం ప్రాజెక్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 11:56 AM

 పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా పూర్తి స్థాయిలో నిర్మించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం తీర్మానం చేసిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద సామూహిక దీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి వరప్రసాదిని పోలవరం ప్రాజెక్టు అని రామకృష్ణ కొనియాడారు. పోలవరం ఎత్తు తగ్గించే కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఖండిస్తున్నామన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించి, పరిహారం చెల్లించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిపూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రామకృష్ణ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa