ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసారు అయితే దీనిపై ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. పూర్తి ఆధారాలతో నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసారు అని అయన తెలిపారు. సీఎం జగన్తో విభేదించే వారు ఓడిపోతారని అన్నారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలకు ఏ గతి పట్టిందో, ఇప్పుడు వారికి కూడా అదే గతి పడుతుందన్నారు.చంద్రబాబుకు నైతిక విలువలు లేవని... గతంలో ఎమ్మెల్యేలను అనైతికంగా కొనుగోలు చేసి ఎన్టీఆర్ ను ఎలా దించారో అందరికీ తెలుసన్నారు.