వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి ఉండవల్లి శ్రీదేవి కాదని ఊసరవెల్లి విమర్శించారు. నాలుగేళ్లుగా కనిపించని లోపాలను ఆమె ఇప్పుడే కనిపెట్టిందా? అని అమర్నాథ్ అడిగాడు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేసే ముందు సీఎం జగన్ వద్దకు కూతురుని తీసుకెళ్లి ఫొటో దిగిందని... ఆయనను అభిమాని అని నమ్మించి మోసం చేయాలని భావించిందని అన్నారు. శ్రీదేవి లాంటి నమ్మక ద్రోహుల గురించి మాట్లాడడం వ్యర్థం అన్నారు. త్వరలోనే ఆమెను అందరూ ఛీకొట్టే స్థాయికి చేరుకుంటుందని అయన అన్నారు.