ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్వర్ణ పతకం లభించింది. 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ పసిడి పతకం సాధించింది. ఈరోజు జరిగిన టైటిల్ పోరులో లవ్లీనా ఆస్ట్రేలియా బాక్సర్ కైట్లిన్ పార్కర్‌ను ఓడించింది.ఈ ఫైనల్ బౌట్లో లవ్లీనా 4-1తో గెలిచి భారత్‌కు స్వర్ణం అందించింది.ఈ ఛాంపియన్‌షిప్‌లో నీతూ గంగాస్ (48 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు), నిఖత్ జరీన్ (50 కేజీలు) ఇప్పటికే పసిడి పతకాలు సాధించారు.