శని గ్రహ బాధలు పోవాలంటే కొన్ని పరిహారాలు పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. నమఃశివాయ జపం చేస్తే శని ప్రభావం ఉండదు. కాకికి బిక్ష పెడితే శని దయగా చూస్తాడని అంటున్నారు. నల్ల ఆవు పాలు, నెయ్యి, పెరుగుతో పూజిస్తే శని బాధ కలిగించడని పేర్కొంటున్నారు. నువ్వుల అన్నంతో శనిని స్తుతిస్తే మంచిది. శంఖువు ఉండే ఇల్లు, సాలగ్రామాన్ని ఆరాధించే వారికి శని బాధలు ఉండవని చెబుతున్నారు.