సత్తెనపల్లి: శరభయ్య క్రీడా ప్రాంగణంలో పోలీసులు-లాయర్ల క్రికెట్ మ్యాచ్ ఆదివారం నిర్వహించగా ముఖ్యఅతిథిగా జడ్జి అబ్దుల్ గౌస్ హాజరయ్యారు. తొలత టాస్ గెలిచిన లాయర్ల జట్టు బ్యాటింగ్ పెంచుకుంది. 15 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పోలీసుల జట్టు 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులే చేయడంతో లాయర్ల జట్టు11 పరుగులతేడాతో విజయతగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. లింగారెడ్డి, ఎపిపి బి. నరసింహారావు సీనియర్ న్యాయవాదులు అబ్దుల్ రహీమ్ మణిబాబు, డి. శ్రీనివాస్ పి. వెంకట కోటయ్య, జి. అజయ్ కుమార్, నరసింహ శాస్త్రి, కె. సాంబశివరావు పాల్గొన్నారు.