విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె కె రాజు సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నుండి పలువురు కార్యాలయంకు విచ్చేసి తమ సమస్యలను కె కె రాజు కి స్వయంగా విన్నవించారు. వారి వద్ద నుండి సంబంధిత వినతి పత్రాలు, దరఖాస్తులు తీసుకుని అధికారులతో మాట్లాడి కొన్ని వెంటనేపరిష్కరించారు. మరికొన్ని సంబంధిత అధికారులకు రిఫర్ చేసి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రీవెన్స్ లో ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర రావు, కార్పొరేటర్లు కె. అనిల్ కుమార్ రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు, వార్డు అధ్యక్షులు నీలి రవి, కె. పి రత్నాకర్, వెలమ సమాజికవర్గ ప్రతినిధి బాపు నాయుడు, యువజన విభాగం జోనల్ ఇంచార్జ్ ఎం. సునీల్, షేఖ్ బాబ్జితదితరులు పాల్గొన్నారు.