భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 10,000 దాటింది. గత 24 గంటల్లో దేశంలో 56,551 కరోనా టెస్టులు చేయగా 1,805 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉంది. నిన్న కరోనాతో ఆరుగురు మరణించారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది.