ఉత్తరప్రదేశ్లో మాఫియా ఆగడాలను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ కి చెందిన గ్యాంగ్ స్టర్ ఆతిక్ అహ్మద్ కు ప్రయాగ్ రాజ్ లోని కోర్టు జీవితకాల జైలు శిక్షను విధించింది. 2006లో ఉమేశ్ పాల్ కిడ్నాప్ కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయన సోదరుడు ఖలీద్ ఆజిమ్ తో పాటు ఏడుగురు కూడా దోషులుగా తేలారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్యే అయిన ఆతిక్ అహ్మద్ పై కనీసం 100 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో మర్డర్, కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి. గత ఫిబ్రవరి 24న ప్రయాగ్ రాజ్ లో కారు నుంచి దిగుతున్న ఉమేశ్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయనతో పాటు ఇద్దరు గన్ మెన్లు కూడా చనిపోయారు.