ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై గల ట్రాక్ పై ఓ మహీంద్రా బొలెరో వాహనం దూసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. జమ్ముకశ్మీర్ లో చెనాబ్ లో 359 మీటర్ల ఎత్తులో రైల్వే వంతెన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ వంతెనపై పనులను పరీక్షించడానికి వచ్చే అధికారుల కోసం మహీంద్రా బొలేరో వాహనాన్ని రైల్వే ట్రాక్ పై వెళ్లేలా తయారుచేశారు. ఈ వాహనం ప్రయాణిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.